తెలుగులో లీడింగ్ వెబ్సైటు గా చేపుకునే ఒక ఆంధ్రా సైటు సింహ మీద బ్యాడ్ రివ్యూ రాయడం వెనుక పెద్ద తతంగమే నడిచింది అని తెలుస్తుంది. ఈ సినిమా ఓవర్ సీస్ పంపిణీదారు ఈ వెబ్ సైట్ నిర్వాహకులని సినిమా ప్రమోషన్ కి సహకరించాల్సిందిగా కోరారట . అందుకు అంగీకరించిన సైటు నిర్వాహకుడు అందుకు గాను 25000 వేల అమెరికన్ డాలర్లు డిమాండ్ చేశారట . అయితే కేవలం ఒక్క సైట్ కి అంత డబ్బు ఇవ్వడం ఇష్టం లేని సదరు పంపిణీదారుడు అందుకు అంగీకరించలేదని దాంతో అసలే కాస్త తలపొగరు కలిగిన సైట్ నిర్వాహకుడు సింహా కి వ్యతిరేకంగా ఆర్టికల్స్ వ్రాయడం మొదలెట్టాడట. అయినా సదరు పంపిణీదారుడు దిగిరాకపోవడంతో తన సత్తా ఏంటో అతనికి చూపించాలని డిసైడ్ అయిన వెబ్ సైట్ ఓనర్ సింహాకి చాల బ్యాడ్ రివ్యూ తన సైట్ లో వ్రాశాడు. అయితే ఆ వెబ్ సైట్ లో వ్రాసిన రేటింగ్ కన్నా కూడా సినిమా చాలా బాగుంది అని మరో టాక్ రావడంతో కంగారు పడి మరొక రివ్యూ ఇంకా చండాలంగా రాయడానికి పూనుకున్నాడట.
ఒక చెత్త సినిమాకి మంచి రివ్యూ వ్రాసినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు గానీ ఒక సినిమా కి రివ్యు వ్రాయడానికి నిర్మాతలని బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి కొన్ని వెబ్ సైట్లు చేరడం ఆందోళనకలిగించే అంశం ఇది ఇలాగే కొనసాగితే రివ్యులని జనం నమ్మే పరిస్థితి ఉండదు.

0 comments