పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘కొమరం పులి’ కథ అంటూ ఓ స్టోరీ ప్రచారంలో ఉంది. దాని ప్రకారం...పులి చిత్రం టెర్రరిజాన్ని అంతం చేయలనే ఓ సిన్సియర్* పోలీసాఫీసర్* కథ. పవన్ కళ్యాణ్ పోలీస్ కమీషనర్ గా చేస్తూ ప్రధాన మంత్రి సభకు సెక్యూరిటీ భాధ్యతలు స్వీకరించి ఆయన్నుప్రాణాలకు తెగించి ఓ టెర్రరిస్ట్ ఎటాక్ నుండి రక్షిస్తాడు.దాంతో అతనికి గోల్డ్ మెడల్ ఇస్తూ...గౌరవ వందనం ఇస్తారు. అంతేగాక ఆయన మెచ్చుకుంటూ తన ప్రాణాలకు రక్షించినందకు పవన్ ని ఏదైనా కోరుకోమంటాడు. అప్పుడు పవన్ ఓ సహాయం అర్దిస్తాడు.
దేశంలో అరాచకం అణుద్దామని ప్రయత్నించిన ప్రతీసారీ రాజకీయనాయకుల వల్ల మిగతా వారి వల్ల సమస్యలు వస్తున్నాయని అందుకే తనకు ప్రత్యేకమైన అథికారాలు ఇస్తే ఏదైనా చెయ్యగలను అంటాడు. అప్పుడాయన ఓ.కె అంటాడు. అక్కడ నుండి పవన్ పులి టీమ్ అని ఏర్పాటు చేసి మాటు వేసిన చిరుతపులిలా సంఘవ్యతిరేక శక్తులను చీల్చిచెండాడుతూంటాడు. అయితే చివరకు అతనికో నిజం తెలుస్తుంది.
అది ప్రధానమంత్రి కూడా ఆ విలన్స్ తో చేతులు కలిపాడని. అంతే ఆయనకు ఎదురుతిర్గుతాడు. అక్కడనుండి హోరో హీరీ పోరాటం జరిగి గెలిచి అందరి మన్ననలూ పొందుతాడు. ఇక హీరోయిన్ కూడా పోలీస్ డిపార్టెమెంట్ లోనే ఉంటుంది. ఎప్పుడూ ఇంట్రావర్ట్ గా ఉండే అతన్ని సరదాగా ఉండే మనిషిని చేసి కర్తవ్యోన్ముఖురాలిని చేస్తుంది. క్లైమాక్స్*కి ముందే హీరోయిన్* నిఖేషా పటేల్* విలన్స్* చేతిలో చనిపోతుందట. అలాగే హీరోకి చిన్నప్పుడు వచ్చి ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా ఆర్ద్రంగా ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలో ఉన్న ఈ కథ కరెక్టే అవటానికి ఎంత అవకాశం ఉందో కాకపోవటానికి కూడా అంతే అవకాశముంది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఎఆర్ రహమాన్ సంగీతం అందించారు. రీసెంట్ గా ఆడియో రిలీజైన ఈ చిత్రాన్ని శింగనమల రమేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు
Latest News
0 comments