Latest News
రేపటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
శ్రీవెంకటేశ్వరస్వామి నవనీత కృష్ణుడు అవతారంలో శుక్రవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై వైభవంగా వూరేగారు. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు తిరుమలేశుడు సూర్య, చంద్రాదులను కూడా తన వాహనాలుగా చేసుకున్నారు. తిరుమల మాడవీధుల్లో చంద్రప్రభ వాహనంపై భక్తులను కనువిందు చేశారు. అంతకు ముందు ఉదయం స్వామి వారు సూర్యప్రభ వాహనంపై వూరేగారు. సూర్యప్రభ వాహన సేవలో శ్రీవారి హారతి పళ్లెం అర్చకుని చేతి నుంచి జారింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. శ్రీవారిని గవర్నరు నరసింహన్ దంపతులు శుక్రవారం మరోమారు దర్శించుకున్నారు. ఉదయం అభిషేకం సేవలో పాల్గొన్నారు.
Tags:
todays news
0 comments