కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలేశుడు రథంపై తిరువీధులలో భక్తులకు దర్శనమిచ్చాడు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీనివాసుడు రథంపై వూరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ అనంతరం ఎక్కువమంది భక్తులు పాల్గొనే కార్యక్రమమిది. కొత్తమెరుగులు దిద్దిన రథంపై పుష్పమాలికలతో అలంకరించిన రథంపై బ్రహ్మండనాయకుని దర్శనం చేసుకున్న భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు.
0 comments