మహిళా విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ గౌరవానికి ప్రత్యేకత ఉంది:పద్మావతి విశ్వవిద్యాలయంనుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకోవటం ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నానని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి పురందరీశ్వరి అన్నారు. తనకు లభించిన అన్ని గౌరవాలలో ఈ గౌరవానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని వారినుంచి డాక్టరేట్ అందుకోవటం ప్రత్యేక గౌరవమని ఆమె అన్నారు. విద్యారంగంలో దశలవారిగా సంస్కరణలను అమలుచేస్తామన్నారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సి ఉందన్నారు. అనంతరం విశ్వవిద్యాలయ ఛాన్సలర్, గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ నాణ్యతతో కూడిన విద్యను అందించాలని అధ్యాపకులను కోరారు. సరస్వతి లక్ష్మీదేవిగా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య బాగుంటే లక్ష్మీదేవి సహజంగానే అనుసరిస్తుందని అన్నారు.
0 comments