Latest News
సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
తిరుమల బ్రహ్మోత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో వైభవంగా కదిలివచ్చారు. బంగారు సూర్యప్రభపై శ్రీవారి వైభోగాన్ని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. బ్రహ్మాత్సవాల్లో గరుడసేవ తర్వాత భక్తులు సూర్యప్రభ వాహనానికి అత్యంత ప్రాధ్యాన్యతనిస్తారు. తేజస్వరూపుడైన సూర్యున్నే వాహనంగా చేసుకున్న శ్రీహరిని దర్శిస్తే సంపూర్ణ ఆరోగ్యసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.
Tags:
todays news
0 comments