రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణల్లో ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణకేంద్రం తెలిపింది. ఒడిషానుంచి దక్షిణ తమిళనాడువరకు వ్యాపించి ఉన్న అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణకేంద్ర అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరంపై నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
0 comments