రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయో లేదోననే అనుమానం కలుగుతోందని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. విజయనగరం పర్యటనలో ఆయన మాట్లాడుతూ లాయర్ల ఆందోళన విషయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోనందునే పరిస్థితి తీవ్రంగా మారిందన్నారు. ఇరువర్గాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఎరువులను దొడ్డిదారిన తరలిస్తున్న సంస్థల లైసెన్సులను తక్షణం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. గనులను జాతీయం చేయాలన్నారు.
0 comments