ఒక హీరోయిన్ ఓ దర్శకుడ్ని ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడో, ఏదైనా దర్శకుడితో హీరో చర్చలు జరిపితేనో.. వారి కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా ఆరంభం అవుతుందనే వార్తలు ఫిలింనగర్‌లో ప్రచారం అవుతాయి. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్న గోవా బ్యూటీ ఇలియానా గురువారం రామ్ గోపాల్‌వర్మను కలిశారు.
అయితే రామూ తదుపరి చిత్రంలో ఇలియానానే కథానాయిక అని మాత్రం ఎవరూ ఊహాగానాలు చేయకూడదట. ఈ విషయాన్ని ఇలియానానే స్వయంగా చెబుతున్నారు. ‘‘రామ్‌గోపాల్ వర్మను కలిసిన మాట వాస్తవమే. కానీ ఆయనతో సినిమా చేయడంలేదు. క్యాజువల్‌గా కలిశాను. అంతే..! రామ్‌గోపాల్ వర్మ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారన్నది నాకు అనవసరం. ఆయన ‘నైస్ పర్సన్’. రామూలో మంచి సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉంది’’ అన్నారు ఇలియానా.
తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నేను... నా రాక్షసి’ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మళ్లీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నందుకు ఇలియానా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఇంకో విషయం ఏంటంటే.. ఇలియానా పేరు మీద ఎవరో ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ ఓపెన్ చేశారట. ‘‘అది నేను కాదు. ఆ ఎకౌంట్‌ను నమ్మకండి’’ అని కూడా చెప్పారు ఈ గోవా బ్యూటీ.
Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.
0 comments