Latest News

ఆ రోజు విమానం పెకైళ్తే ఏం జరిగేదో..?

‘బ్రతుకు జీవుడా.. అని కొన్ని సందర్భాల్లో అనుకుంటుంటాం.
‘బ్రతుకు జీవుడా.. అని కొన్ని సందర్భాల్లో అనుకుంటుంటాం. ఇటీవల నేను అలానే అనుకోవాల్సి వచ్చింది. అసలు జరగకూడనిది జరిగి ఉంటే నేనీపాటికి మీతో ఇలా మాట్లాడుతూ ఉండేదాన్ని కాదేమో’’ అంటున్నారు శ్రీయ. ఈ బ్యూటీకీ ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. చెన్నయ్‌లో మంగళవారం జరిగిన ‘డెంటల్ క్యాంప్’లో పాల్గొనడం కోసం శ్రీయ ముంబయ్‌లో ఫ్లయిట్ ఎక్కారు. ఉదయం ఆరున్నర గంటలకు ఫ్లయిట్ టేకాఫ్ అయ్యింది.

కానీ ఆకాశంలోకి పూర్తిగా ఎగరకముందే ల్యాండ్ అయ్యిందట. మళ్లీ టేకాఫ్ చేయడానికి పైలట్ ప్రయత్నించినప్పటికీ క్షణాల్లోనే ల్యాండ్ అయ్యిందట. ఈ అనుభవం గురించి శ్రీయ చెబుతూ - ‘‘ఇంకా నయం సీట్ బెల్టులు పెట్టుకున్నాం. లేకపోతే గాయాలతో బయటపడేవాళ్లం. ఎందుకిలా అవుతోందని ఫ్లయిట్‌ను సోదా చేశారు. చివరికి ఇంజిన్‌లో పక్షి ఇరుక్కుని చనిపోయి ఉండటం గమనించారు.

ఒకవేళ ఫ్లయిట్ బాగా ఎత్తుకి వెళ్లి ఉంటే జరగకూడనిది జరిగి ఉండేది. అది తల్చుకుంటేనే భయం వేస్తోంది’’ అన్నారు. ఈ సంఘటన వల్ల శ్రీయ వేరే ఫ్లయిట్‌లో చెన్నయ్ చేరుకున్నారు. కానీ డెంటల్ క్యాంప్‌కు ఆలస్యంగా వెళ్లారట. ఆ ప్రాంగణానికి చేరుకున్న తర్వాత.. ఎందుకు ఆలస్యం అయ్యిందో వివరించానని శ్రీయ చెప్పారు.
Tags: ,

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.

0 comments

Leave a Reply